రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి
చైర్మన్ కదిరే అశోక్ రెడ్డి
భూత్పూర్, సెప్టెంబర్ 30 : రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) చైర్మన్ కదిరే అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాం, కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పదవులు కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
సొసైటీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్లపై సమావేశంలో. సంఘం కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని తెలిపారు.
హెచ్ ఆర్ పాలసీ ప్రకారం జీతభత్యాలు అందిస్తున్నామన్నారు. రైతుల పిల్లల విద్యా కోసం కేంద్ర ప్రభుత్వం రుణాలు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ క్లస్టర్ ఆఫీసర్ వేణుగోపాల్, మానిటరింగ్ అధికారి అప్రోజ్, సీఈవో రత్నయ్య, స్టాఫ్ అసిస్టెంట్ రెడ్డి కుంట వెంకటేష్, వైస్ చైర్మన్ శ్రీనివాసులు, డైరెక్టర్లు రామ్ రెడ్డి, యాదయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.