రహదారి గుంతలకు మట్టితో పూడ్చివేత

19-09-2026 | 05:14pm

సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్

బెజ్జంకి, సెప్టెంబర్ 19: మండల కేంద్రంలోని బేగంపేట–గూడెం–బెజ్జంకి (Begumpet–Gudem–Bezzam) ప్రధాన రహదారిపై గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ విజయక్రాంతిలో ఈనెల 19న ప్రచురితమైన కథనానికి రావడం జరిగింది. గూడెం గ్రామ సర్పంచ్ గుడెల్లి శ్రీకాంత్ స్పందించి, రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు మట్టిని తెప్పించి గుంతలను పూడ్చివేయించారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులకు కొంతమేర ఇబ్బందులు తగ్గాయి.

ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకురావడంతో సంబంధిత ప్రజాప్రతినిధి స్పందించి తక్షణ చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు