కుట్టు మిషన్ శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి
బెజ్జూర్ సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి ) బెజ్జూర్ : కుట్టు మిషన్ శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మాజీ ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా(Former MPTC Parveen Sultana) అన్నారు. మండల కేంద్రంలో జన ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సర్పంచులు దుర్గం సరోజ, సండే పద్మలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఇంటి వద్దనే ఉంటూ కుట్టు మిషన్ ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చని, కుటుంబానికి ఆసరాగా నిలవవచ్చని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జాకీర్ హుస్సేన్, రామడుగుల రమేష్, చిలుముల స్వప్న ప్రభాకర్, నాయకులు అమీరుద్దీన్, నరేందర్ గౌడ్, సెండె శంకర్, తెలంగాణ జావిద్, సంజీవ్, సాయి, శ్రీకాంత్, అరుణ్, తిరుపతి, శ్రీశైలం, క్రాంతి, విజయ్, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.