క్రీడా మైదానంలో గ్లోబల్ రెయిన్బో జైత్రయాత్ర
కూసుమంచి,(విజయక్రాంతి): క్రీడా మైదానం(Sports Field)లో గ్లోబల్ రెయిన్బో జైత్రయాత్ర(Global Rainbow's Triumphant Journey) కొనసాగించింది. చదువుల్లోనే కాదు ఆటల్లో కూడా ముందుంటాం అని సత్తా చాటింది. మండల స్థాయి స్కూల్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో కబడ్డీ, వాలీబాల్ విభాగంలో బహుమతలు గెలుచుకొని విజయదుందుభి మోగించింది. కూసుమంచి ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు( సెప్టెంబర్ 17 18 )జరిగిన మండల స్థాయి స్కూల్ ఫెడరేషన్ (SGF) క్రీడా పోటీల్లో కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ రెయిన్బో పాఠశాల విద్యార్థులు(Students) అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. కబడ్డీ సీనియర్ బాలికల విభాగంలో ప్రథమ స్థానం సాధించి తమ ప్రతిభను చాటారు.
అలాగే జూనియర్ వాలీబాల్ బాలికల విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. సీనియర్ బాలికల వాలీబాల్లో ద్వితీయ స్థానం, సీనియర్ బాలుర వాలీబాల్ విభాగంలోనూ ద్వితీయ స్థానం సాధించారు. విద్యార్థులకు ఎంఈవో రాయల వీరస్వామి ప్రశంసా పత్రం, మెడల్స్, షీల్డ్ లు అందజేసి అభినందించారు. శనివారం క్రీడల్లో రాణించిన విద్యార్థులను పాఠశాల కరస్పాడెంట్ మహ్మద్ ఎర్షాద్ అహ్మద్ ,జేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ శేఖర్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్, పాఠశాల ఇన్ చార్జులు జహ్నవి, పాపారావు,నాజీయా, పీఈటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.