గోల్డ్ రేట్లు స్టేబుల్..ఇవాళ్టి ధరలివే!
05-10-2026 | 11:37am
గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన బంగారం, వెండి ధరలు సోమవారం స్థిరంగా (stable) కొనసాగుతున్నాయి. అక్టోబర్ 5న హైదరాబాద్ సహా తెలంగాణలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర (gold rate) రూ.1,49,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,36,750, 18 క్యారెట్ల బంగారం రూ.1,11,890గా కొనసాగుతోంది.
ఇక వెండి ధర (silver rate) కూడా మార్పు లేకుండా ఉంది. గ్రాము వెండి రూ.235 కాగా.. కిలో వెండి రూ.2,35,000గా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు స్థిరంగా (steady) ఉండటంతో కొనుగోలుదారులు రేట్ల కదలికలను గమనిస్తున్నారు.