CJP నేతలకు ముప్పు?
అక్టోబర్ 10 మార్చ్‌పై ఉత్కంఠ.. నేతల అరెస్ట్‌పై సంచలన ఆరోపణ!
న్యూఢిల్లీ, అక్టోబర్ 5 (విజయక్రాంతి): అక్టోబర్ 10న జరగనున్న నిరసనకు ముందు CJP నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్(Sourav Das) ఆరోపించారు. తనతో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijeet Dipke), ఆశుతోష్ రాంకా, రత్నా సింగ్ తదితర నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఆయన ఎలాంటి ఆధారాలను బహిరంగంగా వెల్లడించలేదని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఆశుతోష్ రాంకా, అభిజీత్ దీప్కే సహా నేతలు అరెస్టయినా తమ ఉద్యమం ఆగదని దాస్ అన్నారు. యువత తమ హక్కులు, భవిష్యత్తు కోసం పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 10 నుంచి భారీ స్థాయిలో ప్రజా సమీకరణ చేపట్టాలని కోరారు. CJP అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద Special Intensive Revision (SIR) అంశంపై నిరసనకు పిలుపునిచ్చింది. ఇటీవల ఆశుతోష్ రాంకా సహా సీజేపీ కార్యకర్తలను అసోంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై కూడా పార్టీ విమర్శలు చేసింది. దీంతో అక్టోబర్ 10 నిరసనకు ముందు CJP నేతల అరెస్టు అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
అక్టోబర్ 10న ఢిల్లీలోని(Delhi Protest) జంతర్ మంతర్(Jantar Mantar Protest) వద్ద నిర్వహించనున్న నిరసన(CJP Protest), మార్చ్‌లో పాల్గొనాలని CJP నేత అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. తమ మద్దతుదారులను ‘కాక్రోచెస్’గా సంబోధిస్తూ ఆయన ఈ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దీప్కే “ధైర్యం అంటే దూకుడు కాదు.. క్రమశిక్షణ. ధైర్యం అంటే పట్టుదల” అనే సందేశాన్ని ఇచ్చారు. నిరసనలో సంయమనం పాటిస్తూ శాంతియుతంగా ముందుకు సాగాలని సూచించారు. దీంతో October 10 Jantar Mantar Protest, CJP Protest, Abhijeet Dipke అంశాలు చర్చలోకి వచ్చాయి.