6 September, 2026 | 4:59 PM

గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ

06-09-2026 | 03:11pm

58వేల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా కీలక అడుగు

1.41 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం

ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలం చేయడమే లక్ష్యం

సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కృషితో పనులు 

ఆలేరు, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి(Turkapalli) మండలం గంధమల్ల గ్రామంలో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(MLA Beerla Ilaiah) భూమి పూజ చేశారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభానికి మార్గం సుగమమైంది. గంధమల్ల రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర మండలాల్లోని వ్యవసాయ భూములకు సాగునీటి సౌకర్యం మెరుగుపడనుంది. ప్రాజెక్టు ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని సుమారు 58 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 1.41 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల ప్రాజెక్టును నిర్మించనుంది.

రిజర్వాయర్ నిర్మాణంతో రైతులకు సాగునీటి భరోసా కలగడంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభించనుంది. ఆలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు సస్యశ్యామలం కానున్నాయని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిర్మలాపురం వద్ద ఇప్పటికే శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కృషితో ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు