ప్రభుత్వ కళాశాలలో ఘనంగా హిందీ భాషా దినోత్సవం
19-09-2026 | 09:35pm
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల(Gandhari Mandal) కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం హిందీ భాషా దినోత్సవాన్ని(Hindi Language Day) ఘనంగా నిర్వహించారు. హిందీ లెక్చరర్ గైక్వాడ్ సంభాజి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ ప్రజల మధ్య అనుసంధాన భాషగా హిందీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. విద్యార్థులు హిందీ భాష, సాహిత్యం, సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకుని భాషాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటస్వామి, ఎన్. లక్ష్మణ్, జెట్టి విజయకుమార్, రమేష్, శ్రీధర్, సరిత, సుజాత, మమత, నాన్‌టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.