హాకీలోనూ పసిడి కాంతులు

04-10-2026 | 05:25am
  1. మలేషియాపై ఘనవిజయం
  2. మరోసారి స్వర్ణం కైవసం
  3. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత

ఆసియా క్రీడల హాకీలో మన ఆధిపత్యం మరోసారి స్పష్టంగా కనిపించింది. అంచనాలకు తగ్గట్టే రాణించిన భారత పురుషుల హాకీ జట్టు మరోసారి పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో మలేషియాను చిత్తు చేసి స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంతో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ బెర్తును సైతం ఖాయం చేసుకుంది. శుక్రవారం మహిళల హాకీ జట్టు కూడా పటిష్టమైన చైనాను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో భారత పురుషుల, మహిళల జట్లకు ఒకేసారి స్వర్ణాలు రావడం ఇదే తొలిసారి.

కాకామిగారా, అక్టోబర్ 3 : ఆసియాగేమ్స్‌లో భారత హాకీ పురుషుల(India Mens Hockey) జట్టు కూడా అదరగొట్టింది. శనివారం మలేషియాతో జరిగిన ఫైనల్లో అద్వితీయమైన ప్రదర్శనతో గెలిచింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో భారత్ 5 మలేషియాను చిత్తు చేసింది. ఈ విజయంతో హాకీలో భారత్‌కు రెండు స్వర్ణా లు వచ్చినట్లు అయ్యింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత పురుషుల హాకీ జట్టుకు ఇది ఐదో స్వర్ణం కాగా.. వరుసగా రెండోది.

భారత్ తరఫున హర్మన్ ప్రీత్ సింగ్(11వ, 57వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. జు గ్రాజ్(23వ నిమిషం), హార్దిక్ (42వ నిమి షం), శిలానంద్(54వ నిమిషం) చెరో గోల్స్ నమోదు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట 11వ నిమిషంలో లభించిన తొలి పెనా ల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫిక్‌తో గోల్‌గా మలిచి భారత్‌కు 1- ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఈ సంతో షం ఎంతో సేపు నిలవలేదు.

14వ నిమిషంలో మలేషియా గోల్ కొట్టి స్కోర్లను 1- తో సమం చేసింది. మలేషియా ప్లేయర్ షెల్లో సిల్వరియస్ స్టన్నింగ్ ఫీల్ గోల్‌తో ఆకట్టుకున్నాడు. ఇక్కడ నుంచి భారత్ అటాకిం గ్ గేమ్‌తో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది.  రెండో క్వార్టర్ 23వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్‌రాజ్ సింగ్ అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో గోల్‌గా మలిచాడు. దాంతో ఫస్టాఫ్‌ను భారత్ 2 ముగించింది. సెకండాఫ్‌లో కూడా టీమిండియా దూకుడుగానే ఆడింది. మూడో క్వార్టర్ చివ ర్లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హార్దిక్ గోల్ గా మలిచి ఆధిక్యాన్ని 3 పెంచాడు. 54వ నిమిషంలో అభిషేక్ ఫీల్ గోల్‌తో భారత్ 4 ఆధిక్యంలో నిలిచింది.

ఆ తర్వాత మలేషియా ఆటగాళ్లు కూడా దూకుడుగా ఆడినా భారత డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు. వారి ఎటాకింగ్ గేమ్‌ను భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ ప్రీత్  గోల్‌గా మలిచి 5- భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.ఈ టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు కూడా చైనాను 1-0తో ఓడించి, 44 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కుఇటు పురుషుల, అటు మహిళల హాకీ విభాగాల్లో ఒకేసారి స్వర్ణాలు రావడం ఇదే తొలిసారి. అలాగే ఈ అద్భుత విజయాలతో రెండు విభాగాల్లోనూ భారత జట్లు లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.


మరిన్ని వార్తలు