వినాయక నిమజ్జనం కోసం చెరువు పరిశీలన

18-09-2026 | 07:14pm

మునిపల్లి సెప్టెంబర్ 18( విజయ్ క్రాంతి) : వినాయక నిమజ్జనం కోసం మండలంలోని పెద్ద గోపులారం (Pedda Gopularam)గ్రామ చివరులోని బుగ్గ రామన్న చెరువును శుక్రవారం మునిపల్లి ఎమ్మార్వో రంగారావు, ఎస్సై అరవింద్, పెద్ద గోపులారం సర్పంచ్ బుడ్డ మల్లేశం, మాజీ ఎంపీటీసీ బుర్కల పాండు (Former MPTC member Burkala Pandu) తదితరులు పరిశీలించారు.

ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనాలను ప్రశాంతంగా , కులమతాలకు కచ్చితంగా నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెరువుల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు. వారి వెంట వార్డు సభ్యులు నాగరాజు, శివ కుమార్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు