తెలుగు భాషా దినోత్సవం
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Rao) 112వ జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. హరిత జ్యోతి ప్రజ్వలన చేసి, కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక చైతన్యం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆమె సూచించారు.అనంతరం కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మాట్, డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ , కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారి భాస్కర్, మార్కెట్ చైర్మన్ మంగ, జడ్పీ సీఈఓ లక్మీ నారాయణ, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి హైమద్, జిల్లా రవాణా శాఖ, బాలల సంరక్షణ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.