వామ్మో.. గ్రామ సింహాలు!
09-09-2026 | 03:19pm
రోడ్డుపై నడవాలంటే జంకుతున్న ప్రజలు
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పైకాజీ నగర్లో వీధికుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాలనీలో ఎక్కడ చూసినా గుంపులుగా కుక్కలు సంచరిస్తుండటంతో రోడ్డుపై నడవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఏ సమయంలో కుక్కలు దాడి చేస్తాయోనని చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధికుక్కల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడదను నియంత్రించి, ప్రజలకు భద్రత కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.