బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది "కీచక పర్వం".. సీతక్క వీడియో విడుదల

09-09-2026 | 12:41pm

మహిళా ఎమ్మెల్యే పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది కీలక పర్వం

అసెంబ్లీ వద్ద ఘటనపై మంత్రి సీతక్క వీడియో విడుదల

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు(Telangana Monsoon Assembly Sessions) మూడో కొనసాగుతున్నాయి. శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌(Speaker Prasad Kumar) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఘటనపై మంత్రి సీతక్క(Minister Seethakka) వీడియో విడుదల చేశారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించారని సీతక్క ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. సబిత, సునీత, కోవా లక్ష్మిని గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి వెనుక నుంచి తోశారని వివరించారు.

మహిళా ఎమ్మెల్యేలను నెట్టుకుంటూ గంగుల(Gangula Kamalakar) ముందుకు వచ్చారని తెలిపారు. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల(Woman MLAs) మధ్యలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాకుకుంటూ వచ్చారన్నారు. మహిళా ఎమ్మెల్యేల మధ్యకు చొరబడాల్సిన అవసరం సుధీర్ రెడ్డికి(Sudheer Reddy) ఏముంది? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మహిళా ఎమ్మెల్యేల మీద పడ్డారని సూచించారు. కోవా లక్ష్మి, సబితా మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెయ్యి వేశారని ఆరోపించారు. నవీన్ రెడ్డి నెడుతూ వెళ్లినప్పుడు మహిళా ఎమ్మెల్యే అరిచారని చెప్పారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత, అసభ్య ప్రవర్తన అన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది కీచక పర్వమని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు