అక్టోబర్ 6న హైదరాబాద్ లో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ...

18-09-2026 | 08:24pm

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల ఇంచార్జి భైరపోగు శివకుమార్ మాదిగ 

బాన్సువాడ, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): వచ్చేనెల అక్టోబర్ 6న హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) జరగనున్న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలిరావాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (Madiga Student Federation) ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల ఇంచార్జి భైరపోగు శివకుమార్ మాదిగ పిలుపునిచ్చారు.

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశం ఎంఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కో ఇన్చార్జిలు మావురం శ్రీకాంత్ మాదిగ,మెక్కా సాయి మాదిగ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి నిజామాబాద్ & మెదక్ జిల్లా ల ఇంచార్జి భైరపోగు శివకుమార్ మాదిగ హాజరై మాట్లాడుతూ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్  30 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది,వర్గీకరణ ఫలాలు ప్రతి మాదిగ బిడ్డ మరియు ఉపకులాలు అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

జాతి భవిష్యత్తు కోసం జరిగే ఉద్యమంలో విద్యార్థుల ప్రధాన పాత్ర పోషిస్తూ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘమైన మాదిగ విద్యార్థి సమైక్యను బలోపేతం  చేయాలని సూచించడం జరిగింది. అందులో భాగంగానే స్థానిక సంక్షేమ హాస్టల్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.నూతన బాధ్యులతో ఎంఎస్ఎఫ్ ను మరింత పటిష్టం చేస్తూ  ఎంఎస్ఎఫ్ ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.

రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల మీద మరియు విద్యా సమస్యల మీద మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రత్యేక కార్యచరణ చేపడుతుందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద అణగారిన వర్గాల విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని శివకుమార్ మాదిగ స్పష్టం చేయడం జరిగింది.పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి సూచన మేరకు విద్య హక్కు పరిరక్షణ సామాజిక న్యాయం సమాన అవకాశాల సాధన కోసం ఎంఎస్ఎఫ్ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.

అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది.మాదిగ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.నూతన కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ మాదిగ, ఉపాధ్యక్షులు నవీన్ మాదిగ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ మాదిగ కోశాధికారి జగదీష్ మాదిగ, కిరణ్ మాదిగ,హరీష్ మాదిగ,సతీష్ మాదిగ హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు