గ్రామ పంచాయితీలకు నిధులు ఇవ్వకుంటే ఎలా..?

19-09-2026 | 04:49pm

సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచ్ సతీష్ 

వాంకిడి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికి గ్రామపంచాయతీలకు రూపాయి కూడా రావడం లేదని ఇలా అయితే గ్రామ అభివృద్ధి(Village Development) ఎలా సాధ్యమని అధికారులను వాంకిడి మండలంలోని సోనాపూర్, వాంకిడి సర్పంచ్ సతీష్ తో పాటు పలు గ్రామాల సర్పంచులు అధికారులను ప్రశ్నించారు. స్థానిక మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న(MPDO Patil Jyotsna) అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్, (పీఏసీఎస్) చైర్మన్ జాబోరే పెంటయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అధికారులపై పలువురు సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. స్థానిక మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవని, కనీస వసతులు వంటి పలు సమస్యలను వాంకిడి సర్పంచ్ సతీష్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కోమటి గూడ సర్పంచ్ మోతీరామ్ మాట్లాడుతూ.. కొత్త దుబ్బగూడా లో అంగన్వాడీ టీచర్ రావడం లేదని గత సమావేశంలో చెప్పినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత ఐసిడిఎస్ అధికారులు చర్యలు చేపట్టకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.

అంగన్ వాడి సెంటర్లు అధ్వానంగా మారాయని అధికారుల పర్యవేక్షణ లేదని ఎందుకు గాలికి వదిలేశారని అంగన్వాడీ సూపర్వైజర్ ను ప్రశ్నించారు. అంగన్వాడీ సెంటర్లను పరిశీలించాలని, గ్రామ సర్పంచులకు సమాచారం అందించాలన్నారు. అలాగే మండల స్థాయి సమీక్ష సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడం సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ జావీద్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు