నిమజ్జన శోభాయాత్రకు బందోబస్తు

19-09-2026 | 06:20pm

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల(Ganesh Navaratri celebrations) నేపథ్యంలో శోభయాత్ర, గణేష్ నిమజ్జనం గాట్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) తెలిపారు. శనివారం జిల్లాలోని బాసర గోదావరి, భైంసా పట్టణంలోని గడ్డన్న శుద్ధ వాగు నిమజ్జన ఘాట్లను పరిశీలించి పోలీసు బందోబస్తు పై పోలీసులకు సూచన చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్య తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైంసా, బాసర్ ముధోల్ పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు