కరీంనగర్ జట్టు సత్తా చాటింది

19-09-2026 | 06:14pm

ముకరంపుర, సెప్టెంబర్ 19(విజయ క్రాంతి) నిజామబాద్ లో ఈనెల 17 నుండి 19 వరకు నిర్వహించిన TG TRANSCO/DISCOMS రాష్ట్రస్థాయి ఇంటర్ సర్కిల్ బాస్కెట్‌ బాల్ (State Level Inter Circle Basketball) మరియు టేబుల్ టెన్నిస్ పోటీలలో కరీంనగర్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. బాస్కెట్‌ బాల్ ఫైనల్ పోటీలో కరీంనగర్ జట్టు ఖమ్మం జట్టుపై  విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. అలాగే టేబుల్ టెన్నిస్ విభాగంలో కరీంనగర్ జట్టు తృతీయ స్థానాన్ని సాధించింది.

ఈ సందర్భంగా జట్టు మేనేజర్ G. రాజ్‌కుమార్  మాట్లాడుతూ కరీంనగర్ బాస్కెట్‌బాల్ జట్టు విజయ పరంపర సుమారు 15 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగడం ప్రతి క్రీడాకారుడికి గర్వకారణమని తెలిపారు. ఈ ఘన విజయం సాధించిన కరీంనగర్ బాస్కెట్‌బాల్ మరియు టేబుల్ టెన్నిస్ జట్లను కరీంనగర్, జగిత్యాల మరియు పెద్దపల్లి సూపరింటెండెంట్ ఇంజనీర్లు అభినందించారు.

మరిన్ని వార్తలు