కారు పల్టీ.. యువతికి తీవ్ర గాయాలు

20-09-2026 | 12:36am

- ప్రమాదాన్ని గమనించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ 

కొండపాక: సిద్దిపేట జిల్లా కొడకండ్ల సబ్‌స్టేషన్‌(Kodakandla Substation) సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టడంతో గజ్వేల్‌కు చెందిన సుప్రీత అనే యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుకునూరుపల్లి ఎస్‌ఐ జి. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ జయందర్‌రెడ్డి, మంజుల దంపతుల కుమార్తె సుప్రీత సిద్దిపేట నుంచి గజ్వేల్‌కు కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించిన బండి సంజయ్‌

హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Union Minister Bandi Sanjay) ప్రమాదాన్ని గమనించి అక్కడ ఆగారు. క్షతగాత్రురాలిని పరామర్శించి, తన ఎస్కార్ట్‌ వాహనంలో ఏఆర్‌ఎస్‌ఐ రతన్‌, సిబ్బంది సహాయంతో గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సుప్రీతకు చికిత్స అందిస్తున్నట్లు  వైద్యుల సమాచారం.

మరిన్ని వార్తలు