ఒకే చోట అందరిని కలుసుకోవడం మర్చిపోలేని ఆనందం

30-09-2026 | 08:18pm

ఋషి పంచమి ఉత్సవాల్లో పాల్గొన్న  ఎమ్మెల్యే అనిల్ జాదవ్...

ఉట్నూర్, సెప్టెంబర్ 30( విజయక్రాంతి): ప్రతి ఏటా  ఎంతో ఉత్సవంగా.. భక్తిశ్రద్ధలతో  మత్తురా లాభానా లు ఇంద్రవెల్లి మండలానికి చేరుకొని  ఋషి పంచమి ఉత్సవాలను  ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav )  అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని  అందుతాండా, ఏమైకుంట  గ్రామాల్లో లాభానా లు నిర్వహించిన  ఋషి పంచమి ఉత్సవాలకు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి  ముఖ్య జాన్సన్ నాయక్ తో  కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని వివిధ రాష్ట్రాల్లో  జీవనం సాగిస్తున్న లాభానా లు ఋషి పంచమి రోజు  దైవదర్శనం కొరకు  వేల కిలోమీటర్ల దూరం నుండి  రావడం, దైవ దర్శనం సందర్భంగా తమ సాంప్రదాయాల నృత్యాలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఋషి పంచమి సందర్భంగా  లాభానా ల ను కలుసుకోవడం  మర్చిపోలేని తీపి జ్ఞాపకం గా గుర్తుంటుందని  అన్నారు. రెండు రోజులపాటు  ఋషి పంచమి ఉత్సవాల సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి  వచ్చిన భక్తులందరూ కలుసుకోవడం  హర్షనీయమన్నారు. ఆయనతోపాటు  బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల  బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు