రాజ్‌భవన్ ముట్టడి కేసులో కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కుంభం
09-09-2026 | 01:53pm
ఆలేరు, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌తో కలిసి ఎమ్మెల్యే కోర్టుకు హాజరై విచారణ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి వెంట యాదాద్రి డీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాకునూరి మహేందర్, కాంగ్రెస్ యువ నాయకుడు ఏడునూతల మహేష్ తదితరులు ఉన్నారు.