అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

19-09-2026 | 04:34pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ అన్నోజిగూడకు చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్, తెలంగాణ ఉద్యమ కారుడు బిఆర్ఎస్ నేత సింగిరెడ్డి సాయిరెడ్డి (BRS leader Singireddy Sai Reddy), మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిల తండ్రి సింగిరెడ్డి బిక్షపతి రెడ్డి మరణించడంతో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్  అంత్యక్రియలో పాల్గొని కుటుంబసభ్యులకు  సంతాపం తెలియజేశారు. స్థానిక కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో  అంతిమయాత్రలో పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు