రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

18-09-2026 | 09:46pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): తెలంగాణ ఆదర్శ పాఠశాల(Telangana Ideal School), జూనియర్ కళాశాల అసిఫాబాద్‌కు చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎంపిక పోటీల్లో ఎ.భారతి 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, పి.జస్వంత్ 100 మీటర్లలో ద్వితీయ స్థానం, సి.హెచ్.బన్నీ 400 మీటర్లలో ద్వితీయ స్థానం సాధించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ దుర్గ మహేశ్వర్, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు