రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు
27-08-2026 12:00 AM
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): నేడు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురువనున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ పేర్కొంది.






