ముదిగొండ మండల స్థాయి క్రీడలు ప్రారంభం

18-09-2026 | 06:43pm

ముదిగొండ, విజయక్రాంతి సెప్టెంబర్ 18: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2026-27 ముదిగొండ మండల స్థాయి క్రీడలు (Mudigonda Mandal-level Sports) శుక్రవారం రోజున స్థానిక  St. Ann's హై స్కూల్లో (St. Ann's High School) మండల ఎంఈఓ రమణయ్య, టోర్నమెంట్ కన్వీనర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మొదటగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి, అతను క్రీడారంగానికి చేసిన సేవలను కొని ఆడారు. క్రీడా పతాకాన్ని  ఆవిష్కరించారు. క్రీడల్లో గెలుపోవటములను సమానంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని పేర్కొన్నారు. తర్వాత  క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించడం జరిగింది.

మండల స్థాయి క్రీడల్లో మొదటి రోజు U-14 & U-17 బాలికలకు కబడ్డీ, ఖో -ఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో క్రీడల కన్వీనర్  రమణయ్య,  వెంకటాపురం సర్పంచ్  బాల చందర్ , St. Ann's పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాల్ సుషన్.టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి (P. D) మండల ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాస్, కృష్ణారావు, అబ్బాస్, దేవి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు