కరెంట్ స్తంభమా.. చెట్టు కొమ్మనా?
ములుగు జిల్లా, కన్నాయిగూడెం,అక్టోబర్ 05 (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం (negligence) కారణంగా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని డీటీఆర్పై పిచ్చి చెట్ల తీగలు భారీగా అల్లుకుని ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీటీఆర్పై పెరిగిన చెట్ల తీగలతో విద్యుత్ ప్రమాదాలు (accidents) జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదాలు జరిగిన తర్వాతే విద్యుత్ అధికారులు స్పందిస్తారా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ముందస్తు చర్యలు (precautionary measures) తీసుకుని ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి డీటీఆర్పై అల్లుకున్న చెట్ల తీగలను తొలగించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు (action) చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.