నాలుగేళ్లుగా నత్తనడకన నల్లవాగు వంతెన

30-09-2026 | 03:19pm

బిజినేపల్లి, సెప్టెంబర్ 30 :- జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకు(Medical College) సమీపంలో రూ.11.50 కోట్లతో నిర్మిస్తున్న నల్లవాగు వంతెన పనులు నాలుగేళ్లుగా నత్తనడకన నడుస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి (Former MLA Marri Janardhan Reddy)హయాంలో వంతెన నిర్మాణం కోసం శంఖు స్థాపన చేయగ, ప్రస్తుత కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ పూర్తి కాలేదు.

2022 నవంబరులో నల్లవాగు వంతెన నిర్మాణం కోసం గత ప్రభుత్వం రూ.11.50 కోట్లతో పనులు మొదలు పెట్టిన 6 నెలల్లో డెబ్బై శాతం పూర్తి చేస్తే, మిగిలిన ముప్పై శాతం పనులు మూడేళ్లు పూర్తి కావస్తున్నా  పూర్తి కావడం లేదని నియోజక వర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు.

గత ప్రభుత్వంలో అభివృద్ధి చిరుత పులిలా పరుగులు పెడుతుంటే, ప్రస్తుతం నత్తనడకన కూడా అభివృద్ధి సాగడం లేదని నియోజక వర్గంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు మొద్దు నిద్ర వీడి వంతెనను పూర్తి చేసి వాహనాల రద్దీని  తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు