108 ప్రసాదాలతో గణనాథునికి నైవేద్యం

19-09-2026 | 04:26pm

ఘనంగా అన్న ప్రసాద వితరణ

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 19 ( విజయక్రాంతి ) : భూపాలపల్లి మున్సిపాలిటీ (Bhupalpally Municipality)పరిధిలోని 9వ వార్డు మంజునగర్ వద్దగల శ్రీ వినాయక కాలని, వెంగళరావు వెంచర్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథునికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు. పూజా కార్యక్రమం అనంతరం సుమారు 400 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పైతరి మహేష్ లు మాట్లాడుతూ శ్రీ వినాయక కాలనీలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నాయని, కాలనీవాసులందరి సహకారంతో ఒకే గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రులను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాలనీవాసుల మధ్య మరింత ఆత్మీయతను పెంపొందిస్తాయని అన్నారు.

మరిన్ని వార్తలు