ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతోత్సవాలు

25-09-2026 | 08:31pm

హనుమకొండ, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి):భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)హనుమకొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి  ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  జయంతి(Pandit Deen Dayal Upadhyaya Jayanti) ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి  మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి పండిట్ దీన్ దయల్ ఉపాధ్యాయ కృషి చేశారని,అలాగే జనసంగ్, జనతా పార్టీ అలాగే ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీలో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిసరత్వం రెడ్డి,మాజీ కార్పొరేటర్ చాడా స్వాతి రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు, జయంత్ లాల్, ఉపాధ్యక్షులు కూతురు రాజు, బైరీ శ్రవణ్, అరణ్య రెడ్డి, వాసుదేవరెడ్డి, గిరిజన నాయకులు నాను నాయక్, యువ మోర్చాజిల్లా అధ్యక్షులు పున్నం వేణు, సీనియర్ నాయకులు, రాజభద్రయ్య, శనిగరం విజయ్ కుమార్,బింగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు