ఐసీసీ చీఫ్ జైషాకు పెరిక సురేష్ స్వాగతం
నగోయా, అక్టోబర్ 3 : ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో భార త్ విజయం సాధించి స్వర్ణాన్ని ముద్దాడింది.ఈ మ్యాచ్‌కు ఐసీసీ ఛైర్మన్ జైషా( ICC Chairman Jay Shah) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జైషాకు ఆసియా క్రీడల చీఫ్ ప్రోటోకాల్ అధికారి, తెలంగాణకు చెందిన పెరిక సురేష్ ఘనస్వాగతం పలికారు.
ప్రస్తుత 20వ ఆసియా క్రీడల నిర్వహణలో ప్రోటోకాల్ అధికారిగా బా ధ్యతలు నిర్వహిస్తున్న పెరిక సురేష్ అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల రాక, ప్రో టోకాల్ వ్యవహారాలను సమన్వయం చేస్తున్నారు. కాగా పెరిక సురేష్‌కు ఇలాంటి అత్యు త్తమ బాధ్యతల నిర్వహణ అవకాశం రావ డం తెలంగాణకు గర్వకారణమని పలువురు రాష్ట్ర క్రీడాప్రముఖులు ప్రశంసిస్తున్నారు.