సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన

30-09-2026 | 08:02pm

కాగజ్నగర్,(విజయక్రాంతి): కొమరం భీమ్ ఆసిఫాబాద్(Kumuram Bheem Asifabad) జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సైబర్ మోసాలపై(Cyber Fraud)  పోలీసు అధికారులు  అవగాహన కల్పించారు. పట్టణంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాల, కేరళ హై స్కూల్లో  విద్యార్థులకు ఈ డిజిటల్ కాలంలో ఫైబర్  మోసాలు ఎలా జరుగుతున్నాయో అనే అంశాలపై కాగజ్నగర్ పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్  యాదగిరి అవగాహన  కల్పించారు. ఎవరితోనూ  ఓటీపీలు, ఏటీఎం కార్డుల  పిన్ నంబర్లు  షేర్ చేయవద్దని  అన్నారు. అలాగే గుర్తు తెలియని  వ్యక్తుల నుంచి వచ్చే లింకులన  ఓపెన్ చేయవద్దని, ఒకవేళ లింకులను క్లిక్ చేస్తే  మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని, తద్వారా  వ్యక్తిగత సమాచారము, డబ్బులు కోల్పోతారని  తెలిపారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే  వెంటనే సైబర్ క్రైమ్  1930 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించి, సహాయం పొందడానికి సూచించారు.

మరిన్ని వార్తలు