జీవో 97 రద్దు కోసం పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన

18-09-2026 | 07:27pm

చేగుంట,(విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్య(Polytechnic education)ను హరించే విధంగా తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు(Polytechnic students) నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ పిలుపుమేరకు పాలిటెక్నిక్ లో జరిగే పరీక్షలను సైతం బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జీవో 97 రద్దు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదని విద్యార్థులు పేర్కొన్నారు. కాగా పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన వద్దకు బయట వ్యక్తులు రాకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు