సర్ ప్రక్రియను రద్దు చేయాలి
నటుడు ప్రకాశ్‌రాజ్ డిమాండ్
ఖైరతాబాద్, అక్టోబరు 3 (విజయక్రాం తి): సర్ ప్రక్రియను రద్దు చేసి గత ఓటరు జాబితాను పునరుద్ధరించాలని నటుడు ప్రకాశ్‌రాజ్ డిమాండ్(Actor Prakash Raj) చేశారు. శనివారం సో మాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సర్, ప్రస్తుత రాజకీయ పరిణామాలు అనే అంశంపై నిర్వహిం చిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడారు.
హైకోర్టు మాజీ జడ్జి చంద్రకుమా ర్, సీనియర్ నాయకుడు ప్రతాపరెడ్డి, తెలంగాణ డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేష న్ ప్రెసిడెంట్ వెంకటదాస్, తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం వినాయక్ రెడ్డితో కలిసి సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలోని 23 జిల్లాల్లో 100 పోలింగ్ బూత్‌లను పరిశీలించి, ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న మార్పులను అధ్యయనం చేసినట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు. అర్హత ఉన్న పలువురి పేర్లు జాబితా నుంచి తొలగించబడినట్లు తమ పరిశీలనలో గుర్తించామని చెప్పారు.
ఈ వివరాలను ప్రజల నుంచి సేకరించిన సమాచారంతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్తు న్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించే విషయంలో స్పష్టమైన విధానం, పారదర్శకత అవసరమని అన్నా రు. ఉపాధి, ఇతర కారణాలతో వలస వెళ్లిన వారు కొంతకాలం తమ నివాసంలో లేకపోతే వారి ఓటు హక్కును తొలగించడం సరికాదన్నారు. పేదలు, ఆదివాసీలు, మహిళలు తదితర వర్గాలు ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
ఎస్‌ఐఆర్‌కు ముందు కూడా ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతుండేదని, ఇప్పు డు చేపట్టిన ప్రత్యేక సవరణలో అరత కలిగిన ఓటర్లు తమ అరతను మళ్లీ నిరూపిం చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. అక్రమ వలసదారుల సమస్య ఉంటే ఇంతకాలం కేంద్ర ప్రభు త్వం ఏ చర్యలు తీసుకుందో స్పష్టం చేయాలని కోరారు. ఓటు ప్రజాస్వామ్యం లో కీలకమైన ప్రాథమిక హక్కు అన్నారు.