శ్రీ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు...
బాన్సువాడ, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో(Telangana Tirupati Temple) బుధవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, అభివృద్ధిపై ఎమ్మెల్యే చైర్మన్ కు వివరించారు.ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారి ఆలయం ఏర్పాటు చేయడం ఎంతో సుందరంగా ఉందని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు.
ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ తిరుపతిగా విరజిల్లుతుందని అన్నారు.. అనంతరం ఎమ్మెల్యే పోచారం చైర్మన్ శ్రీనివాస రెడ్డికి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓ ఎస్ డి రెహమాన్, భక్తులు,నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.