రైలులో నిషేధిత గడ్డి మందు స్వాధీనం

08-09-2026 | 01:08am

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): రైలులో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గడ్డి మందును కాగజ్‌నగర్ రైల్వే(Kagaznagar Railway) ఆర్‌పీఎఫ్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న రామగిరి ఎక్స్‌ప్రెస్‌(Ramagiri Express) (17004)ను ప్లాట్‌ఫామ్ నంబర్‌-2 వద్ద ఆర్‌పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 81 గడ్డి మందు ప్యాకెట్లు, 5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఐదు క్యాన్లు, 1 లీటర్ సామర్థ్యం కలిగిన ఐదు క్యాన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మందును కాగజ్‌నగర్ వ్యవసాయ శాఖ అధికారి  రామకృష్ణకు అప్పగించారు.తనిఖీల్లో రైల్వే ఆర్‌పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ మీణ,ఎస్‌ఐ కుమారి ప్రాచీ దేవి, ఏఎస్ఐ ఆర్. దాసు, సిబ్బంది కమలేష్ కుమార్ సింగ్, ప్రేమానంద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు