శ్రీనివాస్ నగర్ కాలనీ గుట్ట సమీపంలో కొండచిలువ కలకలం
30-09-2026 | 04:12pm
కాలనీ సమీపంలో ప్రత్యక్షమైన సుమారు 12 అడుగుల భారీ కొండచిలువ.
పాల్వంచ, సెప్టెంబర్ 30, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీలో బుధవారం కొండచిలువ(Python) కలకలం రేపేంది. కాలనీ సమీపంలో 12 అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో ప్రజలు భయాందోళన గురయ్యారు. కాలనీ వాసులు ఫారెస్ట్ అధికారుల సమాచారం ఇవ్వడంతో కొత్తగూడెం నుంచి స్నేక్ రెస్కు టీం వారు ఆ ప్రాంతానికి చేరుకొని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు.
పట్టుకున్న కొండచిలువను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెడతామని తెలిపిన అధికారులు. కొండచిలువను చూడటానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. రెస్క్యూ టీం అధికారులు కొండచిలువను పట్టుకోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.