21 August, 2026 | 4:10 PM

కోనరావుపేట ఎస్సైగా రామ్మోహన్ బాధ్యతల స్వీకరణ

21-08-2026 03:00 PM

కోనరావుపేట,ఆగస్టు 21(విజయక్రాంతి): కోనరావుపేట పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా రామ్మోహన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కోనరావుపేటకు వచ్చారు.కోనరావుపేట ఎస్సైగా విధులు నిర్వహించిన ప్రశాంత్ రెడ్డి వేములవాడ రూరల్‌కు బదిలీ అయ్యారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై రామ్మోహన్‌కు కోనరావుపేట పోలీస్‌స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.