సీఎం రేవంత్‌తో త్వరలో కీలక చర్చలు
గాంధీ భవన్లో టీపీసీసీ లీగల్ సెల్ భేటీ.. కేంద్రంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
హైదరాబాద్: గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్లో జరిగిన టీపీసీసీ లీగల్ సెల్(TPCC Legal Cell) కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్వకేట్ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, అదే సమయంలో ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని పేర్కొన్నారు. తాను కూడా అడ్వకేట్ కావాలనుకున్నానని, అయితే ఆ అవకాశం దక్కలేదని చెప్పారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అనేక మంది నాయకులు విజయవంతంగా రాణించారని గుర్తుచేశారు. దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కొన్ని Court Judgments చూసి ఆశ్చర్యపోతున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ను కేంద్రం తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని, సీబీఐ (CBI), ఈడీ (ED) వంటి దర్యాప్తు సంస్థలను ఇష్టానుసారం వినియోగిస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.
న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అడ్వకేట్ల Stipends పెంపుపై దృష్టి సారిస్తామని, న్యాయవాదుల సమస్యలపై నవంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(Chief Minister Revanth Reddy) చర్చిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో Advocate Protection Act తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదులకు భద్రత, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 80 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC election) కాంగ్రెస్ మద్దతు ఉన్న సామా రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.