బ్యాగుల్లో కట్టలు కట్టలుగా విదేశీ కరెన్సీ
ఒకే విమానం.. వేర్వేరు పీఎన్ఆర్లు.. రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత!
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Rajiv Gandhi International Airport) భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన Foreign Currencyని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన Airport Security, Customs వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారుల వివరాల ప్రకారం.. ఎయిర్ ఏషియా (AirAsia) AK-68 విమానంలో కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేయగా రూ.63.62 లక్షల విలువైన విదేశీ కరెన్సీ గుర్తించారు. అందులో 66,600 అమెరికన్ డాలర్లు (US Dollars), 3,773 మలేషియన్ రింగిట్లు (Malaysian Ringgit), రెండు సింగపూర్ డాలర్లు (Singapore Dollars) ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మహిళా ప్రయాణికురాలి వద్ద రూ.91.94 లక్షల డాలర్లు
మరో మహిళా ప్రయాణికురాలిని తనిఖీ చేయగా ఆమె వద్ద రూ.91.94 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. ఆమె వద్ద 97,600 అమెరికన్ డాలర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఇద్దరి వద్ద లభించిన కరెన్సీ విలువ కలిపి సుమారు రూ.1.56 కోట్లుగా ఉంది. ఈ వ్యవహారంలో ఇద్దరు ప్రయాణికులను అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ కేసులో మరో కీలక అంశాన్ని DRI అధికారులు గుర్తించారు. ఇద్దరు ప్రయాణికులు వేర్వేరు PNR (Passenger Name Record) నంబర్లతో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, ఒకే విమానంలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ప్రయాణ ఏర్పాట్ల వెనుక ఉన్న కారణాలు, విదేశీ కరెన్సీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలించాలనుకున్నారు అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.