బీజేపీలో ఎమ్మెల్సీ హీట్.. టికెట్లు ఎవరికి?

24-10-2026 | 10:57am

తెలంగాణ బీజేపీలో నేడు కీలక సమావేశం (Key Meeting) జరగనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన హైదరాబాద్‌లో ఈ భేటీ (Meeting) నిర్వహించనున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

పార్టీ జాతీయ నాయకుడు సునీల్‌ బన్సాల్‌ (Sunil Bansal) ఇప్పటికే హైదరాబాద్‌లోనే మకాం వేశారు. అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ రాజకీయ వ్యూహాలు, ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

మరిన్ని వార్తలు