పాలకుర్తి వెలుగు పాఠశాలలో ఎలుకల కలకలం
హుటాహుటిన తనిఖీ చేసిన జిల్లా వైద్య బృందం
పాలకుర్తి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(District Medical and Health Department) అధికారి వాణిశ్రీ(Vanisri) వైద్య సిబ్బందితో కలిసి పాలకుర్తి వెలుగు పాఠశాలను(Palakurthi Velugu School) సందర్శించారు. పాఠశాల ఆవరణలో సుమారు 400 నుండి 500 మంది విద్యార్థులతో మాట్లాడారు. వారిలో ఎలుకలు కొరికిన గాయాలు(Rat-bite wounds), గుర్తులు గాని, జ్వరం గాని లేవని గుర్తించారు. విద్యార్థులతో(Students) మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఏవైనా ఊహించని సంఘటనలు, అసౌకర్యాలు ఎదురైనప్పుడు ఎలాంటి భయం లేకుండా వెంటనే తరగతి ఉపాధ్యాయులకు(Class teachers), పాఠశాల యాజమాన్యానికి తెలియజేయాలని సూచించారు.
ప్రభావితమైన విద్యార్థులందరికీ కుక్కకాటు నివారణ టీకాలను(Dog bite prevention vaccines) ఎలాంటి ఆటంకం లేకుండా పాఠశాలలోనే వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పూర్తి చేయాలని పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందాన్ని ఆదేశించారు. కిటికీలు, తలుపులకు ఎలాంటి పురుగులు, ఎలుకలు, పాములు, తేళ్లు రాకుండా ఉండేందుకు ఇనుప వలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ అధికారి సిద్ధార్థ రెడ్డి, వైద్యాధికారులు స్వప్న, జావేద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.