కామ్రేడ్ కళ్యాణ్ అడుగుపెట్టాడు..
శ్రీవిష్ణు నటించిన కొత్త సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’(Comrade Kalyan). జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇందులో మహిమా నంబియార్ కథానాయిక కాగా.. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి.
తాజాగా స్టార్ హీరో రవితేజ ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను లాంచ్ చేశారు. ‘కామ్రేడ్ కల్యాణు అడుగుపెట్టాడు.. కామ్రేడ్ కల్యాణు అదరగొట్టాడు.. కామ్రేడ్ మన కామ్రేడ్..’ అంటూ సాగుతోందీ గీతం. విజయ్ బుల్గానిన్ స్వరపర్చిన ఈ పాటను భాస్కరభట్ల రాయగా, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.