అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

19-09-2026 | 06:06pm

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలం(Bejjur Mandal)లోని ముంజంపల్లి చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం(ration rice) పట్టుకున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ముంజంపల్లి నుండి బరేగూడ వైపు నాలుగు ప్లాస్టిక్ సంచుల్లో బియ్యం తరలిస్తున్న రెండు వాహనాలను అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. సుమారు 2 క్వింటాల్ పీడీఎస్ బియ్యం గుర్తించారు. వాహనదారులు  ముంజంకర్ ప్రేమ్ సాగర్ (35), ధోరేపల్లి గ్రామం, సిర్పూర్-టి మండలంలోని నన్న శ్రీనివాస్ ముత్యంపేట గ్రామం కౌటాల మండలం అని వెల్లడించాడు. విచారణలో, ముంజంపల్లి పరిసర గ్రామాల పీడీఎస్ లబ్ధిదారుల వద్ద నుండి బియ్యాన్ని కొనుగోలు చేసి, మహారాష్ట్రలోని ఆలపల్లి ప్రాంతంలో విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు అంగీకరించాడు.

ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం లేదా అధిక ధరలకు విక్రయించడం చట్టరీత్యా నేరం. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసులు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామాని తెలిపారు.పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా  విక్రయాలకు సహకరించే వ్యక్తులు, అలాగే లబ్ధిదారుల నుండి బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారులు కూడా చట్టపరమైన చర్యలకు గురవుతారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా, ఎవరికైనా పీడీఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు లేదా తరలిస్తున్నట్లు తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై ఇకపై కూడా నిరంతరం నిఘా ఉంచి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు