చినరాయిగూడెంలో డిజిటల్ క్రాప్ సర్వే పరిశీలన

19-09-2026 | 08:51pm

క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పరిశీలించిన ఏఈఓ లక్ష్మణరావు

మణుగూరు, సెప్టెంబర్ 19,(విజయ క్రాంతి ): మండలంలోని చినరాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) (Digital Crop Survey)ప్రక్రియను వ్యవసాయ విస్తరణ అధికారి డా. కొమరం లక్ష్మణరావు (Dr. Komaram Lakshmana Rao) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాలంటీర్ కొమరం మధుకిరణ్ ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా నిర్దేశించిన ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన పొలాన్ని వాలంటీర్ నేరుగా సందర్శిస్తున్నారు. పొలంలో సాగులో ఉన్న పంటను పరిశీలించి ఫొటో తీసి, పంటకు సంబంధించిన వివరాలతో పాటు ఆ ఫొటోను డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌లో నమోదు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏఈఓ లక్ష్మణరావు సర్వే నంబర్ వారీగా పంటల వివరాల నమోదు, పంట ఫొటోల అప్‌లోడ్ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పంటలను ప్రత్యక్షంగా పరిశీలించి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. డిజిటల్ క్రాప్ సర్వేను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని వాలంటీర్‌కు సూచనలు చేశారు.సర్వే ద్వారా రైతుల సాగు వివరాలు డిజిటల్ రూపంలో నమోదవుతాయని, పంటల వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు తెల్లం నర్సింహారావు, కుంజ భద్రయ్య, కుంజ క్రిస్టయ్య, సత్యం, బత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు