మంచిర్యాలలో వందేమాతర గీతాలాపన
25-09-2026 | 08:20pm
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : వందేమాతరం(Vande Mataram) 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నమామి భారతం శ్రీ సరస్వతి విద్యాపీఠం(Namami Bharatam Sri Saraswati Vidyapeetham) ఆధ్వర్యంలో వందేమాతర గీతాలాపన మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలల్లో, 18 ప్రైవేట్ పాఠశాలల్లో(Private school) 6500 మంది విద్యార్థులతో(Students) పూర్తి వందేమాతరం గీతాలాపన చేయించారు. శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో వందేమాతర కార్యక్రమంలో ముఖ్య వక్తగా విభాగ అధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేర్ శ్రీలక్ష్మీ, సుధమల్ల హరికృష్ణ, ఆచార్యులు, ప్రధాన ఆచార్య ప్రబంధ కార్యని సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.