అనుమతి లేకుండా చెట్లు నరికితే కఠిన చర్యలు

18-09-2026 | 10:31pm

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): అటవీ శాఖ(Forest Department) అనుమతి లేకుండా చెట్లను నరికివేయడం, కలపను అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి సీహెచ్. బాలమణి(District Forest Officer Ch. Balamani) హెచ్చరించారు. చెట్లు పర్యావరణ సమతుల్యత, వర్షపాతం, భూగర్భ జలాలు, వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణలో కీలకమని తెలిపారు. అక్రమంగా చెట్లు నరికివేతపై సమాచారం ఉంటే సమీప అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. అటవీ సంపద పరిరక్షణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు