ధర్మారెడ్డి గ్రామంలో స్వచ్ఛతహి సేవ పక్షోత్సవాల కార్యక్రమం
19-09-2026 | 09:36pm
నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి):మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాల (Swachhtahi Seva Fortnight) కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎంపీపీఎస్ స్కూల్ ఆవరణలో మరియు అంగన్వాడి కేంద్రంలో గల పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. మరియు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి సానిటేషన్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ జయరాజ్, కార్యదర్శు రమేష్,వార్డు సభ్యులు సాయిబాబా, లాలు తదితరులు పాల్గొన్నారు.