ఇంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఊహించలేదు!
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించి చిత్రం ‘తెల్లకాగితం’(Tellakagitham Film). రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. “ఒక మంచి సినిమా తీస్తే ఇంత ప్రేమని ఇస్తారని మళ్లీ నిరూపించారు.
ప్రీమియర్స్ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. అన్ని ప్యూర్ సోల్స్ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో అదే ‘తెల్లకాగితం’. ఎంతో ఇష్టపడి చేశాం ఈ సినిమా” అన్నారు. హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. “తెల్లకాగితం సినిమాకు ఇంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఊహించలేదు. నన్ను అందరూ నక్షత్ర కన్నా ‘ఆశ’ అనే పిలుస్తున్నారు. ఫ్యామిలీస్ అందరూ థియేటర్లకు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది” అని చెప్పింది.
దర్శకుడు రమేశ్ బండ్రెడ్డి మాట్లాడుతూ.. “సినిమాకు ఇంత సూపర్ రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. మొన్న నైట్ షో పడిన కాన్నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. కే రాఘవేంద్రరావు ఫోన్ చేస్తే షాక్ అయ్యా. ‘బాగుంది సినిమా. లొకేషన్స్, అందరూ కూడా బాగా చేశారమ్మా. మీరందరూ కొత్తోళ్లు అయ్యుండి ఇంత పెద్ద మెసేజ్ సినిమా తీయడం చాలా హ్యాపీ అనిపించింది’ అని తెలిపారు. రైటర్ నందు సవరిగాన, నటీనటులు అజయ్, శ్రావ్య, ప్రొడ్యూసర్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు.