కనబడుటలేదు కేసు నమోదు చేసిన పోలీసులు
18-09-2026 | 09:19pm
చేగుంట సెప్టెంబర్ 18,విజయక్రాంతి: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ (Ibrahimpur)గ్రామానికి చెందిన సంద స్వామి ( 38 )గురువారం సాయంత్రం తన ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేడని, చుట్టుపక్కల, బంధువుల వద్ద ఎంత వెతికిన ఆచూకీ తెలవకపోవడంతో , అతని భార్య సంద బాగ్య లక్ష్మి ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.