డ్రైనేజీలో గుర్తుతెలియని మృతదేహం
22-09-2026 | 01:10pm
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ కమాన్ వద్ద డ్రైనేజీ(Drainage)లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న నస్పూర్ పోలీసులు(Naspur Police) సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు.మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన హత్యానా, ఆత్మహత్యానా లేదా ప్రమాదవశాత్తు జరిగినదా అనే విషయం పోలీసులు దర్యాప్తులో తేలనుంది.