మాల విద్యార్థి గర్జన పోస్టర్ ఆవిష్కరణ

20-09-2026 | 12:24am

సిద్దిపేట రూరల్: ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో అక్టోబర్‌ 10న నిర్వహించనున్న “మాల విద్యార్థి గర్జన”(Mala Vidyarthi Garjana) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం సిద్దిపేటలోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద రోస్టర్‌ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ప్రస్తుత రోస్టర్‌ విధానం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. హక్కుల సాధన కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అక్టోబర్‌ 10న మధ్యాహ్నం 3 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే “మాల విద్యార్థి గర్జన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులు, యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కమలాపురం గీతాంజలి, SSF జిల్లా అధ్యక్షుడు రమేష్‌ నాస్తిక్‌, MNS జిల్లా సభ్యుడు శేఖర్‌ సాయి, ఉపాధ్యక్షుడు శ్రావణ్‌, నితిన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు